ఒక్కరోజులో స్టార్ కావాలంటే అది స్పోర్ట్స్ స్టార్స్ కే సాధ్యం. ఒక్క గెలుపు వారి జీవితాలనే మార్చేస్తుంది. సినిమా హీరోలు కూడా ఒక్క రోజులో స్టార్స్ కాలేరు. ఎన్నో జయాపజయాల తర్వాత వారికి పేరొస్తుంది. డబ్బు వస్తుంది. కానీ క్రీడాకారులకు అలా కాదు. వారు ఓ మంచి గేమ్ కొడితే చాలు.. పేరుకు పేరు .. డబ్బుకు డబ్బు. ఇలా ఆశ్చర్యకరమైన విజయాలను అందుకుని ఒక్క రోజులో స్టార్స్ అయినవాళ్లెంతో మంది ఉన్నారు. అలాంటివారిలో సైనా నెహ్వాల్ ఒకరు.