టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి, కోచ్ అనీల్ కూంబ్లేల మధ్య వ్యక్తిగత మనస్పర్ధలు ఉన్నాయన్నది హాట్ న్యూస్. వారిద్దరు పైకి మంచిగా కనిపించినా సరే లోప ఇద్దరు తగువులాడుతున్నట్టు టాక్. అయితే ఈ ఇద్దరి వ్యవహారంపై ఆస్ట్రేలియా మాజి కెప్టెన్ మైకెల్ క్లార్క్ స్పదించాడు. కోచ్ కెప్టెన్ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉంటేనే ఎలాంటి పోటీనైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలమని అన్నాడు.  


ఇద్దరు ఓపెన్ గా నిజాయితీగా ఉండాలని అన్నారు. అంతేకాదు తనకు తెలిసినంతవరకు కూంబ్లే అద్భుతమైన వ్యక్తని తెలుసని. కోచ్ గా కూంబ్లే అన్నివిధాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నారని అన్నాడు. డ్రెస్సింగ్ రూంలో జరిగిన విషయాలు కూబ్లె వేరే వాళ్లతో చెప్పాడన్న వార్తల గురించి తనకు తెలియదని. ఇక కెప్టెన్ అంటే ఫీల్డ్ లో దిగాక అన్ని భాధ్యతలు తానే మోయాల్సి ఉంటుందని. ఒత్తిడి సమయంలో ఇంకా గెలుపు ఓటముల గురించి కెప్టెన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు క్లార్క్.     



మరింత సమాచారం తెలుసుకోండి: