టీం ఇండియా మాజి కోచ్ గా అనీల్ కూంబ్లే కెప్టెన్ విరాట్ కొహ్లితో సఖ్యత లోపించడం వల్లే రిజైన్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే స్వతగా కూంబ్లేకి కోపం ఎక్కువట. తాను టీం ఇండియాకు ఆడే రోజుల్లో కూడా అతని కోపానికి సచిన్, గంగూలిలు దూరంగా ఉండే వారని టాక్. ఇక అలాంటి సమయంలో ద్రవిడ్ తన కోపాన్ని చల్లబరిచే వాడని అంటున్నారు.


ఇద్దరు కర్ణాటక నుండి వచ్చిన ఆటగాళ్లే కాబట్టి కూంబ్లే గురించి ద్రవిడ్ అంతా స్టడీ చేశాడట. సైలెంట్ గా కూంబ్లేతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసేవాడట రాహుల్ ద్రవిడ్. తన కోచింగ్ పట్ల విరాట్ కు అభ్యంతరాల వల్లే తాను కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని కూంబ్లే చెప్పడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: