మిథాలీ రాజ్.. ఈ పేరు తెలియనివారుండరు. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ గా ఆమె సుపరిచితురాలు. మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఆమె ఇటీవలే చరిత్ర సృష్టించారు. ఆటలోనే కాదు.. అందంలోనూ ఆమెది పైచేయే.! అయితే ఆమె అందం అప్పుడప్పుడూ చిక్కులు తెచ్చిపెడుతోంది.

Image result for mithaliraj

        మిథాలీ రాజ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా అంశాలను ఆమె ట్విట్టర్ లోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు. స్నేహితులతో కలిసి ఉన్న ఆ ఫోటోలో మిథాలీ వేసుకున్న డ్రస్ అభిమానులకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. క్రీడాకారిణిలా కాకుండా సినిమా స్టార్ లాగా ఆ డ్రస్ ఉందని ఫీలైపోయారు.

Image result for mithaliraj

        అంతే.. మిథాలీని ఆ ఫోటో వెంటనే తీసేయాలని ట్వీట్లు చేశారు. క్రీడాకారిణిగా  మీరు ఎంతో మందికి స్ఫూర్తి. అలాంటి మీరు ఇలాంటి డ్రస్సు వేసుకోవడం ఇబ్బందిగా ఉంది. మీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. మీరు సెలబ్రిటీ కాదు.. మహిళా క్రికెట్ కెప్టెన్ వి.. ఇలాంటి దుస్తుల్లో మిమ్మల్ని చూడలేకపోతున్నాం.. ఇలా బోలెడు కామెంట్లు ఆమె వాల్ పై వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిపై మిథాలీ ఇంతవరకూ స్పందించలేదు. మరి చూద్దాం..!!


మరింత సమాచారం తెలుసుకోండి: