రవిశాస్త్రి ని కోచ్ గా అప్పాయింట్ చేసిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ లో దాదా సౌరవ్ గంగూలీ కూడా ఒక సభ్యుడు గా ఉన్నాడు. అయితే ఈ రావిశాస్త్రి ఎంపిక ని సెట్టింగ్ గా మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ మీద దాదా సీరియస్ అయ్యాడు  "అతను ఫూలిష్ గా మూర్ఖంగా మాట్లాడాడు  " అన్నాడు దాదా.


రెండు రోజుల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూ లో మాట్లాడిన సెహ్వాగ్ టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నా, బీసీసీఐ పెద్దలతో ‘సెట్టింగ్‘ (సాన్నిహిత్యం) లేకపోవడం వల్లే తనకు ఆ పదవి దక్కలేదని వ్యాఖ్యానించి కలకలం రేపాడు.


బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన గంగూలీ దీనికి ఇవాళ ఆన్సర్ ఇచ్చాడు. దుర్గా పూజ లు ఉండడం తో ఈ నెల 21 న ఇండియా ఆసీస్ మధ్య కొలకత్తా లోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరగనున్న వన్డేపై కొంత సందిగ్ధత నెలకొంది.


అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈడెన్ సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నాడు.  25 వేల టికెట్లు అప్పుడే అమ్ముడు కూడా అయిపోయాయి అన్నాడు దాదా. అలాగే మొత్తం ముప్పై వేల టికెట్లలో 15 వేల టికెట్ లని విక్రయించినట్టు ఆయన చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: