టీం ఇండియా రధసారధిగా ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఎమ్మెస్ ధోని అన్ని ఫార్మెట్ లకు కెప్టెన్ గా గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం వన్ డే సీరీస్ లకు అందుబాటులో ఉంటున్న ధోని త్వరలోనే వీటికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం సగటు ఆటగాడిలా ఉంటున్నా మాకు ధోని ఇప్పటికి కెప్టెనే అంటున్నాడు యుజువేంద్ర చాహల్.


యువ బౌలర్ గా సత్తా చాటుతున్న చాహల్ ఫీల్డ్ లో ప్రస్తుత కెప్టెన్ కొహ్లి మిడ్ ఆన్, లాంగ్ ఆన్ ఫీల్డింగ్ లో ఉంటాడు. ఆ సమయంలో తమకు ధోని గైడ్ చేస్తుంటాడని. ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ ను బట్టి బౌలింగ్ వేయమని సంకేతాలిస్తాడని ఆయన చెప్పినట్టు చేస్తే తప్పకుండా వికెట్ వస్తుందని అన్నాడు చాహల్. కెప్టెన్ గా కొహ్లి ఉన్నా ధోని ఇప్పటికి మా కెప్టెన్ గా అనిపిస్తాడని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చాహల్.  


మరింత సమాచారం తెలుసుకోండి: