భారత యువ బౌలర్ బూమ్రా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 2016 లో అంతర్జాతీయ వన్ డే క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన బూమ్రా ఇప్పటివరకు ఆడిన 28 మ్యాచ్ లలో 52 వికెట్లు సాధించాడు. అతి తక్కువ మ్యాచ్ లో 50 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా అగార్కర్ తర్వాత రెండో స్థానం దక్కించుకున్నాడు బూమ్రా. ముఖ్యంగా జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ గా బూమ్రా క్రేజ్ తెచ్చుకున్నాడు.


ఇక అతి తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లు తీసిన బౌలర్ గా అగార్కర్ ముందున్నాడు. అగార్కర్ కేవలం 23 మ్యాచ్ లలోనే 50 వికెట్లు తీశాడు. రీసెంట్ గా కివీస్ మీద ఆడిన 3వ వన్ డేలో గప్టిల్ వికెట్ తీసిన బూమ్రా తన 50వ వికెట్ తీశాడు. ఇక చివరి ఓవర్లలో మరో రెండు వికెట్లు తీశాడు. ఈమధ్య జట్టు విజయాల్లో బూమ్రా బౌలింగ్ కీలకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: