భారత క్రికెట్ తొలినాళ్లలో స్టైలిష్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ (75) శుక్రవారం చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1960 దశకంలో భారత జట్టుకి ఆడిన మిల్కా సింగ్ తన స్టైలిష్ బ్యాటింగ్ తో అందరి మనసులను గెలిచాడు. మిల్కా సింగ్ 17 ఏళ్లలోనే మద్రాస్ ఇప్పుడు చెన్నై నుండి రంజీ ట్రోఫీలలో ఆడాడు. మిల్కా సింగ్ మాత్రమే కాదు ఆయన తమ్ముడు కృపాల్ సింగ్ కూడా భారత జట్టుకి ఆడాడు.


1961-61 సంవత్సరాల్లో భారత జట్టు తరపున ఇద్దరు అన్నదమ్ములు ఆడారు. మిల్కా సింగ్ అనేక జాతీయ అంతర్జాతీయ మ్యాచులను ఆడటం జరిగింది. 1960లో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిన మిల్కా సింగ్ మంచి ఫీల్డర్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. బిసిసిఐ భారత జట్టులో పలువురు మిల్కా సింగ్ మృతికి సంతాపం తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: