వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 22 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది సైకోం మీరాబాయి చాను. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో మీరాబాయి 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ను మొత్తం 194 కిలోలతో విజేతగా నిలిచింది. ఇండియాకు కరణం మళ్లీశ్వరి తర్వాత బంగారు పతకం తెచ్చి పెట్టిన ఘనత సైకోం మీరాబాయిదే అవ్వడం విశేషం.


1994-95 వరుస రెండు సంవత్సరాల్లో తెలుగు తేజం కరణం మళ్లీశ్వరి బంగారు పతకాలను సాధించింది. ఇక ఆ తర్వాత 1989 నుండి 1999 వరకు కుంజారాణి దేవి 7 సార్లు రజత పతకాలను తెచ్చింది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు సైకోం ద్వారా బంగారు పతకం వచ్చింది. ఇక సైకోం అందుకున్న పతకాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి రాజ్ఞాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది దేశం నిన్ను చూసి గర్విస్తోంది అంటూ ట్వీట్ చేయడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: