వన్ డేల్లో అరుదైన రికార్డ్ నెలకొలిపాడు టీం ఇండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ. శ్రీలంకతో జరిగిన రెండో వన్ డేలో 153 బంతులకు 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ డబుల్ సెంచరీతో వన్ డేల్లో 3 డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్ లోనే కొత్త రికార్డ్ సృష్టించాడు. అయితే రొహిత్ శర్మ సాధించిన ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదని అంటున్నాడు సెలక్షన్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.


2017లో టీం ఇండియా టెస్టు, వన్ డే, టి20 ఇలా అన్ని ఫార్మెట్ లలో సత్తా చాటిందని.. 2018 లో కూడా ఇలానే ఫాం కొనసాగిస్తే మరో ఐదేళ్ల దాకా ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని అన్నారు ఎమ్మెస్కే ప్రసాద్. కెరియర్ లో ఒక డబుల్ సెంచరీ కొట్టడమే ఎక్కువ అనుకుంటుంటే రోహిత్ శర్మ ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించాడని.. అది బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక టీం ఇండియా కెప్టెన్ కొహ్లి గురించి చెబుతూ అతన్ మైదానంలోనే కాదు బయట కూడా హీరోనే అని అన్నారు ఎమ్మెస్కే.



మరింత సమాచారం తెలుసుకోండి: