రాహుల్ ద్రవిడ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చైనా వాల్..టెస్ట్ క్రికెట్ లో ద్రవిడ్ ని వాల్ గా పిలుస్తారు ప్రత్యర్ధులు..ఒక్కసారి ఆటలో దిగి నిలుచున్నాడంటే కట్టిన గోడలా అలాగే ఉండి పోతాడు..బౌలింగ్ చేసే వారు ద్రవిడ్ ని అవుట్ చేయలేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు..టీం ని ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ద్రవిడ్ కెరియర్ లో..అందుకే ద్రవిడ్ ఎంతో మంది యువ క్రికెటర్స్ కి ఆదర్శంగా నిలుస్తాడు.అంతేకాదు ఇప్పుడు భరత్ జట్టుకు ఆడుతున్న మరియు వివిధ దేశాల క్రికెటర్స్ కి ద్రవిడ్ ఎంతో స్పూర్తిని ఇచ్చాడు అనడంలో సందేహం లేదు..

 Image result for rahul dravid

అయితే ఇప్పుడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ,వ్యాఖ్యాత అయిన రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు...భారత్ –ఏ ,అండర్ -19కి రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నారు ఇదే తరహాలో పాక్ యువ జట్టుకు కూడా అందరు గౌరవించే కోచ్ కావాలని అన్నాడు..బీసీసీఐ ఈ విషయంలో ద్రవిడ్ లాంటి గొప్ప ఆటగాడి సేవలని ఎలా అయితే ఉపయోగించుకుంటుందో అలాగే (పీసీబీ )పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అందరు ఒక సీనియర్  క్రికెటర్ ని కోచ్ గా నియమిస్తే బాగుంటుంది అన్నాడు. యువ క్రీడా కారులని ఎంత ప్రోశ్చహిస్తే అంతగా జట్టు పటిష్టంగా ఉంటుదని

అని పాక్‌ అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌కు సన్నద్ధం అవుతున్న తరుణంలో రమీజ్‌ రాజా సూచించారు.

 Image result for rahul dravid

భారత్ లో క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లకి ద్రవిడ్ ఆదర్శంగా నిలిచాడు..అలాంటి ద్రవిడ్ ని కోచ్ గా పెట్టడం వలన యువకులు మంచి క్రీడాకారులుగా తయారవుతారు అని అన్నారు..అండర్ -16 ,అండర్ -19 లో ఉన్న ఆటగాళ్ళని గుర్తించడమే భవిష్యత్తులో క్రికెట్ కి ఎంతో ముఖ్యమని అన్నారు రమీజ్..

 


మరింత సమాచారం తెలుసుకోండి: