ఒకప్పుడు క్రికెట్ లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకొని అనతి కాలంలో కెప్టెన్సీ పదవిలోకి వచ్చిన గొప్ప ఆటగాడు..శ్రీలంక మాస్టర్ బ్లాస్టర్ సనత్ జయసూర్య అంటే తెలియన వారు ఉండరు.  ప్రస్తుతం సనత్ జయసూర్య కి గడ్డకాలం దాపురించింది..ఆయన నడవలేని పరిస్థితికి చేరుకున్నారు.   తన ప్రత్యర్థి ఆటగాళ్లకు బెంబేలు పుట్టిస్తూ..పవర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో బౌలర్లను వణికించాడు.
Image result for జయసూర్య నడవలేని
కానీ 48 ఏళ్ల స‌న‌త్‌ జయసూర్య పరిస్థితి ఇప్పుడు హృదయవిదారకంగా మారడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.  శ్రీలంక టీమ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా కొనసాగిన జయసూర్య.. ఇప్పుడు స్ట్రెచ్చర్స్ సాయంతో అడుగులు వేస్తున్నాడు. మోకాలి గాయం కారణంగా అతడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది.  జయసూర్య వన్డేల్లో 6973 రన్స్ చేశాడు.

బౌలర్‌గా 98 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో 13430 రన్స్ చేసి 323 వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగాడు. ఇదిలా ఉంటే 1989లో శ్రీలంక క్రికెట్ జట్టులోకి వచ్చిన జయసూర్య , 2011లో పదవీ విరమణ తీసుకున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: