క్రికెట్ దేవుడిగా పిలవబడే సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు..సచిన్ అంటే చిన్న పిల్లలకి కూడా ఎంతో ఫేవరేట్ క్రికెటర్..ఎంతో మంది యువ క్రికెటర్లకి ,ఇప్పుడు క్రికెట్ లో వండర్స్ సృష్టిస్తున్న ఎంతో మంది క్రికెటర్స్ కి సచిన్ నే  స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.క్రికెట్ దేవుడిగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు, భారత్ తలెత్తుకుని నిలబడేలా ఎన్నో విజయాలు ,రికార్డులు అందించాడు అందుకే భారత ప్రభుత్వం సచిన్ మన రత్నం అంటూ భారతరత్న అవార్డుతో సత్కరించింది.

Image result for child arman tweet sachin tendulkar

అయితే ఇప్పుడు ఒక పిల్లాడు సచిన్ కి రాసిన లెటర్ నేట్టింట్లో హల్చల్ చేస్తోంది..దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ సచిన్ అంటే ఎంతో అభిమానం ఉంది..అయితే ఓ బుడతడు తన అభిమానాన్ని లేఖ ద్వారా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు...రంగు రంగుల పెన్నులతో లేఖ రాసిన బుడతడు..అందులో ఒక బొమ్మ కూడా గీసి పెట్టాడు.ఆ బుడతడు సచిన్ పై ఎంత ప్రేమని కురిపించాడంటే..

 

“డియర్‌ సచిన్‌” అంకుల్‌...ఈ మధ్యే “సచిన్‌ - ఏ బిలియన్‌ డ్రీమ్స్‌” సినిమా చూశాను. ఆ సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను..నువ్వు నాకొక్కడికే స్పూర్తి ప్రదాత కాదు యావత్ ప్రపంచానికి స్పూర్తి..నీలానే కష్టపడుతా బాగా ఆడుతా..ఎదో ఒక రోజు భారత్ కి ట్రోఫీ అందించే స్థాయికి చేరుకుంటా..నీ సంతకంతో ఉన్న ఈ బ్యాట్ నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను..నాకు ఎంతో గొప్ప బహిమతిని ఇచ్చావు అంటూ “ఆర్మాన్” అనే చిన్న పిల్లాడు రాసిన లేఖ చదివిన ఎవరినా సరే ఎంతో భావోద్వేగాలతో నిండిపోతారు..ఇప్పుడు ఈ లేఖ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

 Image result for child arman tweet sachin tendulkar

ఆ చిన్నారి తనకి రాసిన లేఖకి బదులు ఇస్తూ సచిన్  బాగా కష్టపడు , కష్టపడి నీ కలలని సాకారం చేసుకో అవి నిజం కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు..ట్విట్టర్ వేదికగా సాగిన ఈ అభిమానాలు సచిన్ అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: