హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సాక్షిగా మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అజహరుద్దీన్ కి ఘోరమైన అవమానం జరిగింది..ఈ విషయంపై అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.క్రికెట్ లో ఎ ,బి ,సి ,డి లు కూడా తెలియని వాళ్ళు సైతం హెచ్‌సీఏకు ప్రెసిడెంట్‌గా ఉన్నారని ఇది ఎంతో అవమానకరమైన విషయం అని తెలిపారు.ఒక మాజీ కెప్టెన్ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. పదేళ్ళు పాటు భారత జట్టుకు సారధ్యం వహించిన నన్ను హెచ్‌సీఏ గేటు ముందు గంట సేపు నిలబెట్టారు ,సమావేశానికి రాకుండా అడ్డుకున్నారు అంటూ మండిపడ్డారు అజహరుద్దీన్. అసలు విషయం ఏమిటంటే..

 Image result for azharuddin hca general meeting issue

హెచ్‌సీఏ లో ఆదివారం ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది..దీనికి అజహరుద్దీన్ కూడా రావాల్సి ఉంది అయితే..ఈ సమావేశానికి వచ్చిన  అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకున్నారు..అయితే ఈ విషయంపై..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు మండిపడ్డారు..ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయి సమావేశంలో ఉండగానే  మైక్‌ను నేలకేసి కొట్టారు. ఇక్కడ రాజకీయాలు తగవు ఒక భారత క్రికెట్  జట్టు మాజీ కెప్టెన్ ని ఇలా అవమానిస్తారా అంటూ టీఆర్‌ఎస్‌ నేత,  హెచ్‌సీఏ  ప్రెసిడెంట్‌ వివేక్‌పై  ఫైర్ అయ్యారు.

 Image result for azharuddin hca general meeting issue

అయితే ఈ అంశంపై స్పందించిన వివేక్ అజహరుద్దీన్ పై మాకు ఎంతో గౌరవం ఉంది కానీ “టీసీఏ” (తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని మాకు తెలిసింది అందుకే మేము అనుమతిని ఇవ్వలేదు అంతేగాని వేరే ఉద్దేశ్యం మాకు లేదు అంటూ బదులు ఇచ్చారు..ఎంతో సీనియర్ నేత అయిన  హనుమంత రావు  తన స్థాయిని మర్చిపోయి నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడం మంచిది కాదని విమర్శించారు.. “టీసీఏ”.... వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని..మిగిలవారి విషయాలు మీకు ఎందుకు అని అన్నారు..అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి  అజహరుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అందుకే అజహర్ ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ క్లారిటీ ఇచ్చారు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: