కొన్ని రోజుల క్రితం హెచ్ 1 బీ వీసావిషయంలో ట్రంప్ ప్రకటనతో గందర గోళానికి లోనయిన భారతీయులు.. యూఎస్‌సీఐఎస్‌ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు..వివరాలలోకి వెళ్తే అమెరికాలో భారత టెకీ ల వలన అక్కడ స్థానికంగా ఉండే అమెరికన్ పౌరులకి ఉద్యోగాల విషయంలో గట్టి పోటీ ఉంటోందని భావించిన ట్రంప్ వలసదారులని వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే  హెచ్ 1 బీ విసాని కటినతరం చేశారు.

 Image result for h1b visa

అయితే తన నిర్ణయంతో ఎంతో మంది భారతీయ మరియు దేశ విదేశాల ఉద్యోగులు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం అయిన సమయంలో ఎంతో మంది టెకీ కంపెనీలు..ట్రంప్ తీరుపై విరుచుకుపడ్డారు అంతేకాదు భారతీయ టెకీలు కనుకా మనదేశాన్ని విడచి వెళ్ళడం వలన మనకే నష్టం అని చెప్పడంతో ట్రంప్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు అనే చెప్పాలి..ఇండియన్ టెక్కీస్ కి ఇది నిజంగా శుభవార్త...

 Image result for h1b visa

హెచ్ 1 బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు...అమెరికాలోని ఇండియన్స్, ఇతర దేశీయులంతా తిరిగి తమ స్వదేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై తాజాగా సంబంధిత అధికారులు స్పందించారు...హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ పరిగణలోకి తీసుకోదని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాతన్‌ వితింగ్టన్‌ వెల్లడించారు.

 Image result for h1b visa

యూఎస్‌సీఐఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాదారులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది...


మరింత సమాచారం తెలుసుకోండి: