భారత్ –దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానెను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని..ఈ విషయంలో ఇది బిగ్ మిస్టేక్ అని అన్నాడు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలన్‌ డొనాల్డ్‌. టీమిండియా తుది జట్టులో రహానే కి స్థానం లేకపోవడం సఫారీ ఆటగాళ్లకి ఎంతో సంతోషం కలిగించి ఉంటుంది అని ప్రకటించి మరో షాక్ ఇచ్చాడు...అయితే రహానే ని సప్పోర్ట్ చేస్తూ వస్తున్న తాను ఎందుకు అలా అన్నాడో వివరించాడు కూడా..

 rahaane కోసం చిత్ర ఫలితం

అలన్ చెప్పే విషయం ఏమిటనంటే భారత్‌ తరఫున ఇటీవలి కాలంలో విదేశీ గడ్డలపై  రాణించిన వారిలో రహానెనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని..రహానె, కేఎల్‌ రాహుల్‌ను కాదని శిఖర్‌ధావన్‌..రోహిత్‌శర్మను తొలి టెస్టుకు సెలెక్ట్ చేయడంపై ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని..వారిలో నేను ఒకడినని అన్నాడు అలన్..ఈ సమయంలో కోహ్లీ సేనలో జరగాల్సిన మార్పులపై అలన్ కొన్ని సలహాలని ఇచ్చాడు..

 allan donald కోసం చిత్ర ఫలితం

రహానే చివరిసారిగా ఇక్కడ పర్యటించినపుడు ఎంతో గొప్ప ప్రతిభ కనబరిచాడు..జట్టుని స్థిరంగా నడిపించడంలో గొప్ప ఆటగాడిగా రహానా ముందు ఉంటాడు..ఒక్కసారి ఆటను భాద్యతని నెత్తిన పెట్టుకున్నాడు అంటే ఎంతో కష్టపడి సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడు..అయితే ఎంతో ప్రతిభ గల వ్యక్తి..మైదానంలో ఆటగాళ్లకి డ్రింక్స్ తీసుకుని రావడం చూసి సఫారీ ఆటగాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు..అతడు లేకపోవడం ఎంతో కలిసి వచ్చింది అని సంతోష పడుతూ ఉంటారు..అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు..

 shikhar dhawan కోసం చిత్ర ఫలితం

రహానే..అతనొక అంతర్జాతీయస్థాయి బ్యాట్మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు...ఇదిలా ఉంటే ఎంతో దూకుడుగా ఆడే శిఖర్‌ధావన్‌ ని కూడా పక్కకి పెట్టాలని టీమిండియా భావిస్తే ఆ నిర్ణయం తమకు లాభమేనని దక్షిణాఫ్రికా సంబరపడిపోతుందనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యంలేదు...శిఖర్ ఓ ఖచ్చితమైన ఆటగాడు అని ప్రశంసించాడు..తనని ఎదుర్కోవడంలో తమ బౌలర్లు ఎంతో వైవిధ్యమైన ఆటని ప్రదర్శించాలి అంటూ సూచించాడు.ఏది ఏమైనా ఇప్పుడు రహానే విషయంలో భరత్ బిగ్ మిస్టేక్ చేసిందనే విషయాన్ని తెలిపి అలన్ మంచి పని చేశాడు అంటున్నారు  క్రికెట్ విశ్లేషకులు..


మరింత సమాచారం తెలుసుకోండి: