మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ గురించి ఆసీస్‌ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఎందుకో తెలుసా.. అర్జున్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన గురించి.  మైదానంలో 24 ఏళ్లపాటు క్రికెట్ అభిమానుల్ని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ అరంగేట్రంకి సైలెంట్‌గా రంగం సిద్ధమవుతోంది.

ఇప్పటికే అర్జున్ తాను చదువుతున్న స్కూల్ జట్టు తరఫున ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడమే కాకుండా.. ఫాస్ట్ బౌలర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. గతంలో ముంబయి క్రికెట్ అసోషియేషన్ నిర్వహించిన అండర్-14 జట్టు సెలక్షన్స్‌లో అర్జున్ శతకం బాదేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం అర్జున్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్‌ మైదానం ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.
Image result for sachin arjun
లీగ్‌లో భాగంగా బ్రాడ్‌మన్‌ ఓవల్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచులో అర్జున్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు.  4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మీడియా అర్జున్ ఆటతీరును మెచ్చుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: