భారత్ –దక్షిణాఫ్రికా సీరీస్ మొదటి టెస్టు మ్యాచ్ లో పరాజయం పాలైన భారత జట్టు..ఎంతో కసిగా సెంచురియాన్‌లో రెండోవ టెస్టు మ్యాచ్ ఆరంభించి మొదటి రోజు మ్యాచ్ ముగిసే సరికి  269 / 6  పరుగులు చేసింది..ఇదిలా ఉంటే  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. రెండో టెస్ట్ లో “ధవన్ , భువనేశ్వర్, సహాలను జట్టు నుంచి తొలగించి వాళ్ల స్థానంలో రాహుల్,ఇశాంత్, పార్థీవ్‌లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే.

 Image result for kohli

అయితే మొదటి టెస్ట్ లో ఎంతో అద్భుతమైన ప్రతిభ కనబరచిన..భువనేశ్వర్, సహాలను జట్టులోంచి తప్పించడంతో కోహ్లీని పలువురు క్రికెటర్లు, సీనియర్స్ ,నెటిజన్లు కూడా తిట్టి పోస్తున్నారు. అయితే తాజాగా కోహ్లీని ఓ స్టార్ క్రికెటర్  తన ట్వీట్లతో అందరిని అలరించే విధ్వంసకర క్రికెటర్ సెహ్వాగ్ కూడా ఈ అంశంపై తనదైన శైలీలో స్పందించాడు.

 Image result for sehwag tweet on kohli south africa test match

''ఒక టెస్టు లో సరిగ్గా ఆడలేదని ధవన్‌ను, అసలు ఎటువంటి కారణం లేకుండా భువనేశ్వర్‌ను జట్టులోంచి తప్పించడం చూశాను...ఒకవేళ సెంచురియాన్‌లో కోహ్లీ గొప్ప ప్రదర్శన చేయకుంటే...తానంతట తానుగా మూడో టెస్ట్ నుంచీ స్వయంగా  జట్టులోంచి తప్పుకోవాలి”  అని సెహ్వాగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు...ఇప్పుడు భారత మాజీ ఆటగాడు.. విధ్వంసకర బ్యాట్స్ మెన్ అయిన “సెహ్వాగ్” కోహ్లీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి .సెహ్వాగ్ కి కోపం రావడం నిజమే అంటూ మరో కొంతమంది నెటిజన్లు కూడా కోహ్లీ పై మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: