ఇప్పుడు ఇద్దరి ఆటగాళ్ళ మీదనే భారత రెండవ టెస్టు గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి..రెండో టెస్టు లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్లని కోల్పోయి 183 పరుగులు చేసింది..అయితే మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌట్ కాగా...ఇండియా టీం ఇంకో 152 పరుగులు చేయాల్సి ఉంది..భారత జట్టు కెప్టెన్ విరాట్ 85 పరుగులు చేయగా హార్దిక్ పాండ్య 11 పరుగులు చేశాడు ఇప్పుడు ఇద్దరూ కూడా క్రీజులోనే ఉన్నారు..వీరు ఎంత నిలకడగా ఆడితే అంతగా టీం ఇండియా గెలుపు ఆధారపడి ఉంది.

 Image result for pandya kohli batting

ఇదిలా ఉంటే రెండో రోజు లంచ్ సెషన్ లో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు 28 పరుగులు వద్ద రాహుల్(10) వికెట్ కోల్పోయింది...వెంటనే పూజారా కూడా అనవసర పరుగుతో రన్ అవుట్ అయ్యాడు..దాంతో  భారత్ పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయింది..ఆ సమయంలో కోహ్లీ , విజయ్ కలిసి 79 పరుగులు వరకూ స్కోర్ ని తీసుకువెళ్ళారు. తరువాత 46 పరుగులు వద్ద విజయ్‌ పెవిలియన్ చేరాడు.

 Related image

ఆ తరువాత వచ్చిన రోహిత్ శర్మ(10 ) కూడా వేణు తిరిగాడు..పార్థీవ్ పటేల్ క్రీజులోకి ఎంటర్ అయ్యాడు ఈ సమయంలో కూడా పార్ధీవ్  పెవిలియన్ కి చేరడంతో భారత్ 164 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. పార్ధివ్ తరువాత వచ్చిన పాండ్య మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 183/5 వద్ద రెండో రోజు ఆట ముగించింది..సోమవారం జరగబోయే మ్యాచ్ లో అయినా నిలకడగా పాండ్యా ,కోహ్లీ ఆడితేనే గానీ మిగిలిన 152 పరుగుల టార్గెట్ ని చేరుకోలేము.
Related image


మరింత సమాచారం తెలుసుకోండి: