టెన్నిస్ తార..వీనస్ కి ఈ సీజన్ కలిసిరానట్టుగానే ఉంది..తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్ సంచలనాలకి వేదిక అయ్యింది..టైటిల్ గెలుచుకునే  వారిలో ముందు వరుసలో ఉన్న వీనస్ విలియమ్స్ తోలి రౌండ్లోనే ఓడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది..ఇదిలా ఉంటే క్రిందటి ఏడాది యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన అమెరికా యువ తార స్లోయెన్‌ స్టీఫెన్స్‌.. సెమీఫైనలిస్ట్‌ కొకొ వాండవెఘె.. ఆస్ట్రేలియా వెటరన్‌ ప్లేయర్‌ సమంతా స్టోసర్‌..చెక్‌ స్టార్‌ పెట్రా క్విటోవా మొదటి మ్యాచ్లోనే ఓడిపోయారు...అయితే పురుషుల సింగిల్స్‌లో దిగ్గజాలు అయిన రఫెల్‌ నడాల్‌..రోజర్‌ ఫెడరర్‌..నొవాక్‌ జొకోవిచ్‌ సునాయాస విజయాలతో శుభారంభం చేశారు.

 Image result for venus vs bencic

మహిళల సింగిల్స్ లో గతేడాది రన్నరప్ అయిన ఐదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌(అమెరికా)..పదో సీడ్‌ కోకో వాండెవె (అమెరికా)..13వ సీడ్..గతేడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), 11వ సీడ్‌ మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) తొలి రౌండ్‌లోనే ఘోరమైన పరాజయం పాలయ్యారు..  వీనస్ తన తొలి రౌండ్‌లో  3–6, 5–7తో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో పారాజయం పాలయ్యింది.. అంతేకాదు కోకో 6–7 (4/7), 2–6తో బాబోస్‌ (హంగేరి) చేతిలో... స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–2, 6–7 (2/7), 2–6తో షుయె జాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోగా “మ్లాడెనోవిచ్‌ 3–6, 2–6తో బొగ్డాన్‌ (రొమేనియా) చేతిలో ఓడిపోయారు.  


ఇదిలా ఉంటే  తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 7–6 (7/5), 6–1తో ఐఅవా (ఆస్ట్రేలియా)పై, మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–4, 6–3తో పొంచెట్‌ (ఫ్రాన్స్‌)పై, షరపోవా (రష్యా) 6–1, 6–4తో మరియా (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి చేరారు.  

Image result for nadal tennis

ఇక పురుషుల సింగిల్స్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మాజీ చాంపియన్స్‌ నాదల్‌ (స్పెయిన్‌), జొకోవిచ్‌ (సెర్బియా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మొదటి రౌండ్ లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6–1, 6–1, 6–1తో బర్గోస్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌)పై, రెండో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–4, 6–3తో బెడెన్‌ (స్లొవేనియా)పై, 14వ సీడ్‌ జొకోవిచ్‌ 6–1, 6–2, 6–4తో యంగ్‌ (అమె రికా)పై గెలుపొందారు. కాగా ఎనిమిదో సీడ్‌ జాక్‌ సోక్‌ (అమెరికా)..11వ సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా), 16వ సీడ్‌ ఇస్నెర్‌ (అమెరికా) కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.

Image result for federer tennis

సుగిటా (జపాన్‌) 6–1, 7–6 (7/4), 5–7, 6–3తో జాక్‌ సాక్‌పై... ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) 6–4, 3–6, 6–3, 6–3తో ఇస్నెర్‌పై, ఎడ్మండ్‌ (బ్రిటన్‌) 6–7 (4/7), 6–3, 3–6, 6–3, 6–4తో అండర్సన్‌పై నెగ్గారు. భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ 6–7 (4/7), 4–6, 3–6తో బగ్ధాటిస్‌ (సైప్రస్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: