సఫారీల సొంత గడ్డపై టీం ఇండియా వరుస దెబ్బలుతగులుతున్నా సరే ఆటలో సరైన ప్రతిభ కనబరచడం లేదు..ఎంతో శ్రద్ధగా ఆడాల్సిన మ్యాచ్ లని నిర్లక్ష్యం గా ఆడుతూ భారత్ కి వరుస అపజయాలని తీసుకు వస్తున్నారు అని అంటూ భారత మాజీ క్రికెటర్లు అందరు ఒకరి తరువాత ఒకరుగా టెస్టు మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ సేనపై విమర్శలు గుప్పిస్తున్నారు..అసలే తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆడుతున్న టీం ఇండియా కి వీరి కామెంట్స్ తో మరింత ఒత్తడి పెంచుతున్నారు..

 Image result for sunil gava

దక్షిణాఫ్రికాలో టీమిండియా ఇప్పట్లో  కోలుకునే అవకాశం లేదని.. ఓటములు తప్పవని రెండో టెస్టుకు ముందే వీరు తన ట్విట్టర్ ఖాతాలో చెప్పాడు..ఇప్పుడు తాజాగా మరో మాజీ కెప్టెన్‌ లెజండరీ ప్లేయర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేసిన కామెంట్స్ డైరెక్ట్ గా కోహ్లీకి తగులుతున్నాయి....ధోని జట్టులో ఉండుంటే బాగుండేది అంటున్నారు. ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచీ తప్పుకున్న ధోనీ ని మళ్ళీ టెస్టు క్రికెట్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాడు.

 Image result for dhoni

ధోని టెస్టుల్లో ఆడటాడిని రెడీ అయితే తక్షణమే మళ్ళీ జట్టులోకి రావాలని కోరుతున్నాడు..కెప్టెన్‌గా బాధ్య తలు వదులుకున్న ధోని..వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మెన్‌గా ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు ఈ మాజీ క్రికెటర్..అటు  మైదా  నంలో..డ్రస్సింగ్‌ రూమ్‌లో ధోనిసలహాలు, సూచ నలు ఆటగాళ్లకు కీలకం కాగలవని అంటున్నాడు..దాంతో ఒక్కసారిగా ధోనీ జట్టులో ఉంటే బాగుండు అనే అభిప్రాయం అభిమానులలో కూడా ఏర్పడింది. అయితే ఒక సీనియర్ ఆటగాడిగా సునీల్ ఈ సమయంలో ఇలా మాట్లాడటం జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..మరి కోహ్లీ ఈ కామెంట్స్ కి ఎలా బడులిస్తాడో చూడాలి.

Image result for south africa test india team

మరింత సమాచారం తెలుసుకోండి: