ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ప్రత్యర్థుల బౌలింగ్ ని చిత్తు చేయడంలో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు సునీల్‌ గవాస్కర్‌ .  తాజాగా దక్షిణాఫ్రికాతో నిన్న ముగిసిన రెండో టెస్టులో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆయన ఓ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.  సెంచూరియాన్ టెస్ట్ లో కీలకమైన క్యాచ్‌లను పార్థీవ్‌ పటేల్‌ వదిలేయడంతో ధోని అవసరాన్ని గుర్తు చేశాడు .
Image result for ms dhoni
వన్డే తరహాలో కెప్టెన్‌ బాధ్యతలను వదులుకొని వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా కొనసాగాల్సింది.  దోని మంచి ఆటగాడు..టీమ్ ని సమర్ధవంతంగా మ్యానేజ్ చేయగల సత్తా ఆయనకు ఉంది.ధోనీ టెస్టులను వీడాల్సింది కాదు.
Image result for team india parthiv patel
 ఇక 2004లో విదేశాల్లో టెస్టు మ్యాచ్‌ ఆడిన పార్థీవ్‌కు చోటు కల్పించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసాడు గవాస్కర్‌.మొదటి ఇన్నింగ్స్‌లో ఆమ్లా, డు ప్లిసిస్‌ సునాయాసమైన క్యాచ్‌లు పార్థీవ్‌ వదిలేసి విమర్శల పాలయ్యాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా కూడా పార్థీవ్‌ ఫెయిల్ అయ్యాడని గవాస్కర్ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: