భారత జట్టు కెప్టెన్ అంటే ఆట ఒక్కటి వచ్చి ఉంటే సరిపోదు..ఎంతో నేర్పు కూడా ఉండాలి..ఓడినా గెలిచిన వాటి నుంచీ కొత్త విషయాలు తెలుసుకోవాలి..ఎంతో సహనాన్ని ప్రదర్శించాలి..అయితే కోహ్లీ మాత్రం తన సహనాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయాడు..దక్షిణాఫ్రికా టూర్ ఘోరమైన వైఫ్యల్యం చెందడంతో మీడియా కోహ్లీని  అడిగిన ప్రశ్నలకి చాలా దురుసుగా సమాధానం చెప్పాడు..దాంతో ఒక్కసారి గా సీనియర్స్ అందరు కోహ్లీ ప్రవర్తనపై  విరుచుకు పడ్డారు...అసలు కోహ్లీ ఏమన్నాడంటే...

 Related image

అత్యుత్తమ తుది జట్టును ఎంచుకోవటంలో విఫలమవుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు..కోహ్లీ ఫైర్ అయ్యాడు మేము ఒకవేళ సీరిస్ గెలిచి ఉంటే అత్యుత్తమ జట్టు అనే ప్రస్తావన వచ్చి ఉండేదా..? కూర్చుని కబుర్లు చెప్తే సరిపోదు ఆడేవాళ్ళకి తెలుస్తుంది..మీరే ఇకనుంచి జట్టుని సెలెక్ట్ చేయండి మేము ఆడుతాం  అంటూ ఫైర్ అయ్యాడు..అయితే ఇప్పుడు సీరీస్ ఓడిపోవడం మాట పక్కన పెడితే కోహ్లీ పైనే మీడియా ఫోకస్ చేసింది..కోహ్లీ ఇలా మాట్లాడి ఉండకూడదు అంటూ సూచనలు చేస్తున్నారు సీనియర్ క్రికెటర్స్..

 Image result for michael holding cricketer

అయితే కోహ్లీకి వెస్టిండీస్ ఫేమస్ బౌలర్ మైకేల్‌ హోల్డింగ్‌ హితబోద చేశాడు..భారత జట్టుకు కోహ్లి ఒక యువ కెప్టెన్‌...అయితే యువకుడు కాబట్టి ఎలా కెప్టెన్ గా వ్యవహరించాలో ఇంకా తెలియడం లేదు..ఒకొసారి కొద్దిపాటి ఎమెషనల్‌కు గురయ్యే కోహ్లి... మరికొన్ని సందర్బాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తాడు. “కోహ్లీ” మా జట్టు మాజీ కెప్టెన్‌ “సర్‌ రిచర్డ్స్‌” ను చూసి ఎంతో నేర్చుకోవాలి అంటూ చురకలు అంటించాడు. విరాట్ పదే పదే జట్టుని మారుస్తూ ఉంటాడు..అలా చేయడం వలన ఆటగాళ్ళు ఎంతో కన్ఫ్యూజ్ అవుతారు అసలు వాళ్ళు ఆడాలా వద్దా అనే సందిగ్ధతకి లోనవుతారు తుది జట్లలో మార్పులు అవసరమే.. కానీ మ్యాచ్‌ మ్యాచ్‌కు అవసరం లేదు...రిచర్డ్స్ వంటి వారిని చూసి నేర్చుకుంటే మంచిది అంటూ హోల్డింగ్‌ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేశాడు..మరి కోహ్లీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: