“భారత్ ,పాక్ మ్యాచ్ అంటేనే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది యావత్ భారతావని..దాదాపు ఇరు దేశాల మ్యాచ్ లో భారత్ గెలిచిన సంఖ్యే ఎక్కువ..తజాగా జరిగిన అండర్‌-19 ప్రపంచ కప్‌లో  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను యువ భారత్‌ చిత్తు చేసి ఫైనల్‌లోకి ప్రవేశించిన విషయం అందరికీ తెలుసు పాక్‌పై టీమిండియా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ టోర్నీ లో భరత్ ఆటతీరు కుర్రాళ్ళ తెగువ గురించి మాట్లాడని వారు ఎవరు లేరు అయితే ఇక్కడ రాహుల్ గురించి మాత్రం యావత్ క్రికెట్ ప్రపంచం అంతా సలాం కొడుతోంది..

 Image result for under 19 world cup 2018 india vs pakistan

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణను మెచ్చుకోని వారు లేరు. టీమిండియా ఆటతీరును మెచ్చుకుంటూ పలువురు ప్రముఖులు వరుస ట్వీట్లు పెడుతున్నారు...అయితే ట్వీట్ జాబితాలోకి పాక్ అభిమానులు కోఅ చేరిపోయారు.. రాహుల్‌ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు...“భారత్‌ గెలవడానికి వారి వెనక రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణ ఉంది. మరి మా పాకిస్థాన్‌ జట్టు వెనక అలాంటి వారు ఎవరూ లేరు. అందుకే మేం ఓడాం..అని పాక్ అభిమానులు తమ భాదని వ్యక్తం చేస్తూనే ఒక వైపు రాహుల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు..

 Image result for under 19 world cup 2018 india vs pakistan

అంతేకాదు పాక్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న మన్సూర్‌ రాణాకు ఎలాంటి అనుభవం లేదని..విమర్సల వర్షం కురిపిస్తున్నారు..రాహుల్ లా సీనియర్లు ఎవరూ కూడా  యువ పాక్‌ జట్టుకు సూచనలు చేస్తూ ముందుకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు...అయితే రాహుల్ లా ఆలోచించే సీనియర్స్ ఉంది ఉంటే బాగుండేది..మాకు రాహుల్ లాంటి కోచ్ కావాలి అంటూ నెటిజన్లు రాహుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

 Image result for under 19 world cup 2018 rahul dravid


మరింత సమాచారం తెలుసుకోండి: