దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు కెప్టన్ “విరాట్ కోహ్లి” ఎంతో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు..అయితే క్యాచ్ ఎవరైనా పట్టుకుంటారు అని అనుకోకండి..తీవ్రమైన గాయంతో ఉన్నా కూడా కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు...మ్యాచ్ ఆరంభంలోనే బౌండరీ లైన్‌ వద్ద బంతిని ఆపడానికి ప్రయత్నం చేసిన కోహ్లీ మోకాలికి గాయం అయ్యింది..దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుని గాయం పై ఐస్ క్యూబ్ ఉంచుకుని సేద తీరాడు..

 ..

ఈ సమయంలో కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుని నడిపించాడు...ఫిజియోతో చర్చించిన విరాట్ కోహ్లి మళ్లీ మైదానంలోకి వచ్చాడు..అయితే వచ్చీ రాగానే  అధ్బుతమైన డైవ్ క్యాచ్‌‌ పట్టి ఆటపై తనకున్న ప్రేమని కమిట్మెంట్ చాటి చెప్పాడు...ఇన్నింగ్స్‌ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్ మిల్లర్ (7: 7 బంతుల్లో 1x4) బంతిని షార్ట్ కవర్ దిశగా నెట్టేందుకు ప్రయత్నించాడు.

 Image result for india-vs-south-africa-1st-odi-at-durban-virat-kohli-takes-a-diving-catch

అయితే.. బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బంతి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది దాంతో కళ్ళు చెదిరేలా ఒక్కసారిగా డైవ్ చేసి కోహ్లీ చక్కగా  క్యాచ్ ని ఒడిసిపట్టుకున్నాడు..కళ్లు చెదిరే రీతిలో ముందుకి డైవ్ చేసిన కోహ్లి చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. క్యాచ్ పట్టిన అనంతరం పైకి లేచిన కోహ్లి.. గాయం కారణంగా రెండు.. మూడు అడుగులు ఇబ్బందిగా వేయడం కనిపించింది...కోహ్లీ కి తొందగారా గాయం తగ్గిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..కోహ్లీ పట్టిన ఈ క్యాచ్ కోహ్లీ పై మరింత అభిమానం పెంచేలా చేసిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: