రాహుల్ ద్రవిడ్ అండర్ -19  యువ భారత జట్టుకి కోచ్..తమ క్రికెటర్లకి వారి వారి మొబైల్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోమని ఆదేశాలు జరీ చేశాడట..శనివారం ఉదయం ప్రారంభం కానున్న ఐసీసీ అండర్ -19 జట్టు ఫైనల్లో భరత్ – ఆస్ట్రేలియా లు తలపడనున్నాయి..ఈ సందర్భంలోనే ద్రవిడ్ వారిని మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడట..

 Related image

ఎందుకు అందరినీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడంటే ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు అండర్‌-19 భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫైనల్‌ ముగిసే వరకూ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేశాడట...ద్రవిడ్‌ ఇలా చేయడం ఇది తొలిసారి కాదు..మొన్నటికి మొన్న ఐపీఎల్‌ వేలం సమయంలోనూ వారికి క్లాస్‌ పీకిన సంగతి తెలిసిందే. “ఐపీఎల్‌ వేలం ఏటా నిర్వహిస్తారు కానీ అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం మాత్రం రెండేళ్లకు ఒకసారి వస్తుంది ఆటపై దృష్టి పెట్టండి అంటూ ద్రవిడ్ సీరియస్ అయ్యాడట.

 Image result for rahul dravid serious

 పాక్‌తో సెమీఫైనల్‌ అనంతరం మా కుమారుడు శివమ్‌ మావితో మాట్లాడదామని అనుకున్నాను కానీ మావాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది..గత ఆదివారం చివరి సారిగా శివమ్‌తో మాట్లాడాను. ప్రధాన మ్యాచ్‌లకు ముందు ఫోన్లు వాడొద్దని ద్రవిడ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు అప్పుడే శివమ్‌ మాతో చెప్పాడు’ అని శివమ్‌ తండ్రి పంకజ్‌ మావి తెలిపారు...భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: