ద్రవిడ్ కోచ్ గా భాద్యతలు తీసుకొనే ముందు వరకు మన జూనియర్ క్రికెట్ టీం పై ఎటువంటి అంచనాలు లేవు. ఎప్పుడైతే మిస్టర్ డిపెండబుల్ చేతుల్లోకి భవిష్యత్ స్టార్స్ వెళ్లారో వారి ఆట మెరుగవుతూ వచ్చింది. అందుకు నిదర్శనమే ఈ ప్రపంచ కప్. ప్రపంచకప్ లీగ్ దశలోనుండే నిలకడ ప్రదర్శన కనపరిచిన భారత జట్టు నేడు  శనివారం జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 పరుగుల స్వల్పలక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ప్రపంచ కప్ ను ముద్దాడింది. 
మౌంట్ మాంగన్యూ వేదికగా భారత్‌‌తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 217  పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకానోక ద‌శ‌లో 134 ప‌రుగులకు 3 వికెట్లు కోల్పోయి  పటిష్ఠంగా ఉన్న ఆసీస్‌ 250 మార్కును చేరుకోవడం చాలా  సులభమే అనిపించింది. కానీ ఒక్కసారిగా భారత బౌలర్లు విజృభించడంతో తరువాతి 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్ కోటి, శివ సింగ్, ఇషాన్ పోరేల్ తలో రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ మావి ఒక వికెట్ తీశాడు.


ఇక 217  పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ౩8.5  ఓవర్లలో రెండువికెట్ల నష్టానికి 220  పరుగులు చేసి ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఓవరాల్ గా భారత్ కు  ఇది నాలుగో అండర్-19 ప్రపంచకప్ సాధించడం విశేషం. 217 పరుగుల విజయ లక్ష్యంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కొద్ది సేపటికే వర్షం మొదలైంది. దీనితో అంపైర్లు మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు.కొద్దిసేపటి తరువాత మ్యాచ్ ప్రారంభించినా బారత్ ఎక్కడా తడబడలేదు. ఇండియన్ క్రికెటర్ మంజోత్ సెంచరీ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకో క్రికెటర్ మన్‌జోత్‌ కార్లా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ కప్ సాధించిన కుర్రాళ్లకు అందరు ప్రముఖులనుండి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: