టీమ్ ఇండియా కుర్రాళ్లు చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోకుండానే సగర్వంగా నాలుగోసారి అండర్ 19 ప్రపంచ కప్‌ను ఎత్తారు. సిరీస్ ఆరంభం నుంచి ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాహుల్ ద్రవిడ్ అధీనంలోని భారత యువకులు ఫైనల్‌లోనూ అదే జోరు..హోరును చూపించారు.  న్యూజిలాండ్ వేదికగా శనివారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మన ... తొలిసారి అండర్‌-19 వరల్డ్‌ కప్‌ను గెలవగా, 2008లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని యువ టీమిండియా రెండోసారి కప్‌ సాధించింది. ఆపై 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ కెప్టెన్సీలో భారత్‌ మరోమారు వరల్డ్‌కప్‌ను సాధించారు.  ఈ గెలుపుతో అండర్-19 ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు(నాలుగుసార్లు) గెలుపొందిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది.

విశ్వ విజేతగా భారత్..!

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విదేశీ గడ్డపై విజయం సాధించింది.."విశ్వ విజేతలు"గా భారత కుర్ర్రాళ్ళు మన సత్తా చాటారు..216 పరుగుల లక్ష్యాన్ని చేదించారు..ఇంకా 67 బంతులు  8 వికెట్లు ఉండగానే భారత్ కి,  క్రికెట్ అభిమానులకి  ఎంతో అమోఘమైన  విజయాన్ని అందించారు..మంజోత్ కార్లా (101 , నాటౌట్ ) తో ఆసీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు..

 manjot kalra

ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగిన భార‌త్ ఓపెన‌ర్‌ కెప్టెన్ “పృథ్వీ షా 29” ప‌రుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. స‌ద‌ర్‌లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. “సుభమన్ గిల్ 31” పరుగులు చేయగా..”హార్విక్ దేశాయ్ 47” పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు..ఎంతో నిలకడగా ఆడుతూ భారత్ కి విజయాన్ని అందించడంలో ఎంతో కృషి చేశారు భారత్ జట్టు కుర్రాళ్ళు..

 Image result for under 19 world cup bharat win

ఇదిలా ఉంటే ..భరత్ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ ని నిలువరించడం లో  సక్సెస్ అయ్యారు.. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్, శివ సింగ్, కమలేష్ నాగర్‌కోటి, అనుకుల్ రాయ్ తలో రెండు వికెట్లు తీశారు. శివమ్ మావికి ఒక వికెట్ దక్కింది. అభిషేక్ శర్మ మినహా మిగతా బౌలర్లందరికీ వికెట్ దక్కింది...అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా భారత్  రికార్డ్ నెలకొల్పింది.

 Image result for under 19 world cup bharat win


మరింత సమాచారం తెలుసుకోండి: