నా కొడుకు  అర్జున్ లానే ఉంచండి నాతో పోల్చకండి..ఇది కరెక్ట్ కాదు..అంటూ సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు..ఇదేంటి ఇలా అనేశారు సచిన్ అనుకునేలోగా అసలు విషయం చెప్పారు..అసలు ఎందుకు సచిన్ ఇలా అన్నాడంటే..

 Image result for sachin tendulkar son age

గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఆటో ఎక్స్పో కి హాజరయిన సచిన మీడియాతో మాట్లాడారు..తన కొడుకుని తనతో పోల్చకండి అంటూ తెలిపారు..తనకి ఒక పేరు ఉందని..ఆ పేరుతోనే తను ఎదగాలని చెప్పారు..తనకి నచ్చిన విధంగా ఎలా వెళ్ళాలి అనే అవకాశాన్ని స్వేచ్చని తనకి ఇచ్చానని తెలిపారు సచిన్..అయితే ఈ కొడుకులో మరో సచిన్ చూస్తున్నారా అని అడుగా లేదు అస్సలు అలాంటి పోలికలకి తావు లేదు అంటూ సచిన్ చెప్పారు.

 Image result for auto expo 2018 sachin

 మా నాన్నగారి లాగానే అర్జున్ కి నేను స్వేచ్చని ఇచ్చాను..తనకి కష్టపడే తత్వం ఉంది కష్టపడుతున్నాడు..తను జీవితంలో ఏం కోరుకున్నా ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను..అతడి దృష్టంతా ఆట మీద..తన గోల్ మీద ఉండాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నాను..అయితే పోలికలు రావడం సహజం కానీ పిల్లలకి ఏది అభిరుచో అది చేయాలి.టార్గెట్ ఉంటే కెరీర్ లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే సులభంగా దాటేస్తారు అని సచిన్ తెలిపారు.

 Image result for sachin tendulkar son and schin

 

తండ్రికి తగ్గ నాయుడిగా సచిన్ కొడుకు అర్జున్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు..బ్రాడ్‌మన్‌ ఓవల్‌లో జరిగిన మ్యాచులో అర్జున్ నాలుగు వికెట్లు తీసి 27 బంతుల్లో 48 పరుగులు చేసిన సంఘటనని  ఆస్ట్రేలియా మీడియా మొత్తం ప్రసంసించిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే..

 


మరింత సమాచారం తెలుసుకోండి: