దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్  ఆటగాళ్ళు చెలరేగి ఆడుతున్నారు...భారత్ కెప్టెన్ కోహ్లీ ,ఓపెనర్ శిఖర్ ధావన్ లు..చేసే పరుగులకి సఫారీ లు బెంబేలెత్తి పోతున్నారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ మొన్నటిలానే వికెట్ కోల్పోయాడు..దాంతో ఒక్కసారిగా భరత్ పై ఒత్తిడి పడింది..ఈ సమయంలోనే బ్యాటింగ్‌కి దిగిన కోహ్లీ ధవన్‌కి మద్దతునిస్తూ. బంతిని బౌండరీలకి పంపిస్తున్నారు.

 Image result for kohli dhawan 4th odi

వీరిద్దరి భాగస్వామంతోనే రెండో వికెట్‌కి 119 పరుగులు  జత చేసి రికార్డు సృష్టించారు.అంతేకాదు రెండో వికెట్‌కి వీరిద్దరు కలిసి ఎనిమిదిసార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ ఫీట్‌తో భారత క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ద్రవిడ్‌ల రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో శ్రీలంక క్రికెటర్లు సంగక్కర, దిల్షాన్‌లు మొదటిస్థానంలో ఉన్నారు.

 Related image

కోహ్లీ ధావన్ లు ఇద్దరూ కలిసి రెండు వికెట్ కి  19 సార్లు 100+ పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు...కాగా కోహ్లీ 75(83) పరుగులు క్యాచ్ అవుట్ అయ్యి వెనుదిరిగాడు..అయితే కోహ్లీ స్థానంలో వచ్చిన రహనే మెల్లగా ఆడుతూ స్కోర్ పెంచుతున్నారు..34 ఓవర్లు మగిసేసరికి భారత్ 2 వికెట్ల  నష్టానికి 200 పరుగులు చేసింది...శిఖర్ ధావన్ సెంచరీ చేసి 102 బంతుల్లో 107 పరుగులు చేసి రహనే భాగస్వామ్యంతో స్కోర్ ని ముందుకు తీసుకువేల్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: