సరదాగా చేసే పనులు ఒక్కోసారి పరువుపోయే దిశగా ఉంటాయి..దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షల్ గిబ్స్ చేసిన ఓ కామెంట్స్ కి ట్విట్టర్ వేదికగా పరుపు పోగొట్టుకున్నాడు..గిబ్స్ చేసిన ట్వీట్ కి..భారత స్పిన్నర్ అశ్విన్ ఘాటు రిప్లై ఇచ్చాడు..బంతులని తిప్పేయడంతో మాత్రమే కాదు మాటల తూటాలు పేల్చడంలో కూడా అశ్విన్ చెలరేగి పోయాడు..ఇంతకీ అసలేమి జరిగిందంటే.

 Image result for aswin tweet about gibbsImage result for aswin tweet about gibbs

 

అశ్విన్ కొన్న కొత్త షూస్..తనకి ఎంతో సౌకర్యంగా ఉన్నాయి..ఎంతో బాగున్నాయి అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు...అయితే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షల్‌ గిబ్స్‌..అశ్విన్ పై ఎదో జోక్ చేయాలని భావించి “ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా” అంటూ అశ్విన్ పై వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టాడు..దాంతో చిర్రెత్తు కొచ్చిన అశ్విన్ గిబ్స్ కి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు..

 Image result for gibbs cricketer

“ఈ విషయంలో నువ్వే బెటర్, నీలా నేను పరిగెత్తలేను, మాట్లాడలేను , ఆడలేను..నీలా నైతికత మర్చిపోయి మ్యాచ్ ఫిక్సింగ్ లు చేయలేను అంటూ బదులు ఇచ్చాడు దాంతో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది..వాస్తవానికి అదృష్టవంతుడిని కాదు కాబట్టి నిజంగానే వేగంగా పరుగెత్తలేను మిత్రమా. 2000 మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో గిబ్స్‌ దోషిగా తేలి ఆరు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కున్నాడు..అయితే అశ్విన్ ట్వీట్ పై స్పందించిన గిబ్స్ నేను చేసిన జోక్ కి నువ్వు ఫీల్ అయ్యావ్ జోక్ ని అర్థం చేసుకోలేవా అంటూ బదులు ఇచ్చాడు...అశ్విన్ కూడా బదులిస్తూ నేను చేసింది “జోకే” అంటూ తన కామెంట్ డిలీట్ చేశాడు..అంతేకాదు త్వరలో మనం కలిసి కూర్చుని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని బదులిచ్చాడు అశ్విన్.

 Image result for aswin tweet about gibbs


మరింత సమాచారం తెలుసుకోండి: