భారత్ కి సఫారీలకి జరుగుతున్న టీ 20 మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చాయి..దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో ముందుగా  తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు ప్రోటీస్‌ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

 Image result for india vs south africa t20 2018

అయితే వన్డేలలో నిరసపరిచినట్లుగానే ఈ పర్యటనలో మరో మారు విఫల చెంది నిరాశపరిచాడు..కేవలం 11 పరుగులు మాత్రమే చేసి డాలా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు...ఆ తర్వాత సురేష్ రైనా, ధావన్‌లు సఫారీలపై విరుచుకుపడ్డారు. ఈ దశలో సురేష్ రైనా సఫీరీలకి చుక్కలు చూపించాడు.. రైనా 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 పరుగులు చేసి షంషీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం మంచి ఫాంలో ఉన్న ధావన్(46) రనౌట్‌గా వెనుదిరిగాడు..

.Related image

అయితే తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఎవరు కూడా సరైన రీతిలో తమ ప్రతిభని కనబరచలేదు..దాంతో నిర్ణీత ఓవర్లో భారత 7 వికెట్ల నష్టానికి గాను 172 పరుగులు చేసింది..సఫారీల బౌలర్స్ లలో డాలా 3, మోరిస్ 2, షంషీ 1 వికెట్ తీశారు.దాంతో 173 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచారు భారత ఆటగాళ్ళు..

 Image result for dhawan


మరింత సమాచారం తెలుసుకోండి: