సౌత్ ఆఫ్రికా ఫేసర్ మొర్నీ మోర్కెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు..ఓ మంచి బౌలర్ గా ఎంతో ప్రతిభకనబరిచిన మోర్కెల్ తీసుకున్న నిర్ణయం తన అభిమానులని ఎంతో నిరాశకి గురిచేస్తోంది..వచ్చే నెలలో తన స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ముగిసిన తరువాత “రిటైర్మెంట్” ప్రకటిస్తానని స్పష్టం తెలిపారు మోర్కెల్..అయితే రిటైర్మెంట్ వెనుక కారణాలని కూడా వెల్లడించాడు..

 Image result for south african bowler morkel

తనకి ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యులు వలన తన ఫ్యామిలీ కి దూరం ఉండటమే కాకుండా ఎంతో తీవ్రమైన ఒత్తడిని ఎదుర్కుంటున్నానని తెలిపాడు..అయితే రిటైర్మెంట్ నిర్ణయం ఎంతో కష్టంగా ఉన్నా సరే సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు  ఇదే మంచి సమయం అనేది తెలుస్తోంది..కానీ ఇంకా నాలో క్రికెట్ జీవితం చాలా ఉంది...కానీ.. 
Image result for south african bowler morkel
కుటుంబం తో తన జీవితం ప్రశాంతంగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు అని తెలిపాడు..మోర్కెల్ చరిత్ర తీసుకుంటే..2006లో భారత్‌పై అరంగేట్రం చేసిన మోర్కెల్ సఫారీ జట్టు తరఫున  83 టెస్టులు ఆడి 294 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు...ప్రొటీస్‌కు ఆడటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన మోర్కెల్.. ఏండ్ల తరబడి తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.అయితే మోర్కెల్ తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని సీఎస్ఏ సీఈవో అన్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: