భారత షూటర్ రిజ్వీ ప్రపంచ రికార్డు సృష్టించాడు..మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ పోటీలలో అడుగుపెట్టిన ఈ 23 ఏళ్ళ యువ షూటర్ భారత్ స్వర్ణం  తెచ్చిపెట్టాడు..వివరాలలోకి వెళ్తే మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్షిప్ లో భారత యువ షూటర్లు రికార్డులని నెలకొల్పారు..ముఖ్యంగా రిజ్వీ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలుచుకు న్నాడు.

 shooting world cup 2018 rijvi కోసం చిత్ర ఫలితం

అయితే ఈ పోటీల్లో  స్టార్ షూటర్ జితూరాయ్..మెహూలి ఘోష్‌, లు కాంస్య పతకాలు గెలుచుకోగా మీరట్ కి చెందిన రిజ్వీ 242.3 పాయింట్లు సాధించి "రియో ఒలింపిక్ చాంపియన్  క్రిస్టియన్ రిట్జ్‌” ను ఓడించాడు..ఇక జితురాయ్ 219 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా మహిళల విభాగంలో తొలి సారి వరల్డ్ కప్ పోటీల్లో బరిలోకి దిగిన మెహూలీ 228.4 పాయింట్లతో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.

 shooting world cup 2018 rijvi కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా భారత్‌కు చెందిన ముద్గల్..అపూర్వి..నాలుగు ఏడు స్థానాల్లో నిలిచారు.. భారత్ కి స్వర్ణం తెచ్చిపెట్టిన రిజ్వీని  భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ ప్రశంసించారు..మిగిలిన షూటర్లు అందరికీ అభినందనలు తెలియచేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: