ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా మంగళవారం (మార్చి-6)న కొలంబోలో టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్స్ కి చోటు దక్కిన విషయం తెలిసిందే. కాగా టీమ్ ఇండియా ఆటగాళ్లు పేలవంగా ఆడటంతో  మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
Image result for India vs Sri Lanka, Nidahas Trophy T20
నిదహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ గత ఐదేళ్లలో అత్యధిక డకౌట్‌లు అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. మార్చి 6, 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 12 సార్లు డకౌట్ అయ్యాడు. 11 డక్‌లతో  పేసర్ భువనేశ్వర్ కుమార్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
CRICKET
ఇక టీ20ల్లో రోహిత్‌కు ఇది ఐదో డకౌట్. 68 టీ20 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 5 సార్లు డకౌట్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మూడేసి డక్‌లతో ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్‌లు కొనసాగుతున్నారు.

Image result for టీమిండియా టీ20

ఇండియా టీమ్
రోహిత్, ధావన్, రైనా, మనాశ్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శంకర్, ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, చాహల్
శ్రీలంక టీమ్
తరంగ, గుణతిలక, కుశాల్ మెండీస్, ఛండిమల్, కుశాల్ పెరీరా, శంకా, తిసారా పెరీరా, జీవన్ మెండీస్, ధనంజయ, ఛమీరా, ప్రదీప్


మరింత సమాచారం తెలుసుకోండి: