భారత క్రికెటర్లకి పంట పండింది..ఒక్కసారిగా అందరు ఎగిరి గంతెసేలా నిర్ణయం తీసుకుంది బీసిసిఐ..ఇంత పెద్ద మొత్తంలో బీసీసీఐ వెతనాలని ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది..ఇంతకీ ఏమిటా ప్యాకేజే అంటే..టాప్‌ గ్రేడ్‌ క్రికెటర్లకు ఏకంగా రూ.7 కోట్ల భారీ ప్యాకేజీ అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఏ+, ఏ, బీ, సీ అని మొత్తం నాలుగు విభాగాలుగా కాంట్రాక్టులకు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏ+ గ్రేడ్‌ కేటగిరిలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, జస్ప్రిత్‌ బూమ్రా లు ఉన్నారు వీరి కాంట్రాక్ట్‌ కింద భారీ స్థాయిలోరూ. 7కోట్ల వేతనం అందనుంది. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ఆడుతూ రాణిస్తున్న వారికి ఈ గ్రేడ్‌ ఇచ్చారు...అయితే గతంలో ఇదే ఆటగాళ్లకి రూ.2 కోట్ల మేర ప్యాకేజీ అందేది.

 Image result for kohli bcci team

ఇదిలాఉంటే ఏ గ్రేడ్‌ మొత్తంగా 7 మంది ఆటగాళ్లున్నారు. ఎంఎస్‌ ధోని, అశ్విన్‌, జడేజా, అజింక్య రహానే, మురళీ విజయ్‌, చతేశ్వర్‌ పుజారా, వృద్ధిమాన్‌ సాహాలకు..బీసీసిఐ ప్రస్తుత నిర్ణయం ప్రకారం రూ.5కోట్లు అందుకోనున్నారు. గ్రేడ్‌ బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్‌-సి ఆటగాళ్లకు రూ.కోటి మేర ఇవ్వనున్నారు.

 Image result for kohli

అయితే ఈ తాజా కాంట్రాక్టుల పై సీఓఏ వినోద్ రాజ్ మాట్లాడారు.. ఇటీవల కోహ్లి, ధోని, రోహిత్‌ శర్మ, కోచ్‌ రవిశాస్త్రిలు కలిసి ఈ విషయంపై మాతో చర్చించారు. కేవలం ఏ గ్రేడ్‌ ఆటగాళ్లు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారని, మరో ప్రత్యామ్నాయం ఆలోచించి.. కాంట్రాక్టులను పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏ+, ఏ అని మొత్తం 12 మంది నాణ్యమైన ఆటగాళ్లకు ఈ జాబితాల్లో చేర్చామని.. కార్పోరేట్‌ స్థాయిలో పంపకాలు జరిగే విధంగా కాంట్రాక్టులను తయారుచేశామని తెలిపారు వినోద్ రాయ్.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: