భారత జట్టు బోణీ కొట్టింది..అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది..ముక్కోణపు టీ-20 టోర్నీలో భాగంగా శ్రీలకం తో జరిగిన మొదటి పోరులో అపజయాన్ని చవి చుసిన భారత జట్టు రెండోవ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది..బౌలింగ్ లో టీం ఇండియా క్రికెటర్లు రాణించడంతో..నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న భారత్...బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.

 Image result for bangladesh vs india 2018 t 20

అయితే ఇక్బాల్ 16 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు..వికెట్ కీపర్ ముస్‌ఫికర్ రహీమ్ 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి శంకర్ బౌలింగ్‌లో  క్యాచ్ అవుట్ అవ్వగా.. కెప్టెన్ మహ్మదుల్లా..కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు వెళ్లాడు. లిటోన్ దాస్ 30 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 34 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు...ఇలా ఒకరి తరువాత ఒకరుగుఆ భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక పోయారు..భారత జట్టులో జయదేవ్ నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా..విజయ్ శంకర్ నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి వెనుతిరిగాడు శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్, యుజువేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.

 Image result for bangladesh vs india 2018 t 20

తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు 140 పరుగుల లక్షాన్ని 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది...కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో...17 పరుగులు  చేసి బౌల్డ్ అయ్యాడు. సురేష్ రైనా 27 బంతులలో 28 పరుగులు క్యాచ్ అవుట్ అయ్యాడు..శిఖర్ ధావన్ మాత్రం తనా ఫాం ని కంటిన్యూ చేశాడు... 43 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 55 పరుగులు అహ్మద్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: