శ్రీలంకలో జరుగుతున్న టీ-20 ముక్కోణవు సీరీస్ లో ఎంతో ఉత్కంట పోరు జరుగుతోంది.ఈ సీరీస్ లో ఒక్కో జట్టు ఒక ఓటమి ఒక గెలుపుతో ఉండటం ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు..మూడు జట్లు ఆటగాళ్ళు సైతం ఈ గెలుపు చావో రేవో అన్నట్లుగా పోటీ పడటానికి సిద్దంగా ఉన్నారు..ఇదిలాఉంటే ఈరోజు రాత్రి ప్రారంభం కానున్న భారత్,శ్రీలంక జట్ల విజయంతో ఎవరు ఫైనల్ కి వెళ్తారో అనే సందిగ్ధత నెలకొంది..టీం ఇండియా ఈ సీరీస్ లో ఫైనల్ కి వెళ్ళాలి అంటే సోమవారం జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించాల్సిందే..

Image result for t20 tri series

అయితే ఇప్పటివరకూ ఈ టోర్నీలో భారత జట్టు బ్యాటింగ్..పర్వాలేదు అనిపించినా..చక్కని ఆటతీరు ప్రదర్శించ వలసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది..గత రెండు మ్యాచ్ లలో రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు నిరాశపరిచిన విషయం విదితమే మరి ఈ గెలుపు చావో రేవో అనుకున్న తరుణంలో రోహిత్ పైనే అందరి దృష్టి ఉంది..కెప్టెన్ గా ఒక పక్క..మరో పక్క బ్యాట్స్ మెన్ గా బ్యాలెన్స్ చేసుకోలేక పోతున్నాడా అనేది విశ్లేషకుల అభిప్రాయం..అయితే ఈ మ్యాచ్ లో మాత్రం అందరి చూపు రోహిత్ వైపే ఉంది అనడంలో సందేహం లేదు...ఇప్పుడు భారత్ కి కీలకమైన మ్యాచ్ కావడంతో రోహిత్ గనుకా రాణిస్తే ధావన్ సపోర్ట్ తో తప్పకుండా విజయ సాధించవచ్చు..

Image result for srilanka vs india t20 tri series

ఇదిలాఉంటే ఇప్పుడు భరత్ లానే లంక బలం కూడా బ్యాటింగ్ అని చెప్పాలి అయితే..రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడటంతో చండిమాల్‌ స్థా నంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు...ముందు నుంచీ జరుగుతూ వస్తున్న టోర్నీలో..లంక బ్యాటింగ్ పరంగా దూసుకు వెళ్తోంది..ముఖ్యంగా కుశాల్‌ పెరీరా స్ట్రయిక్‌రేట్‌ అసాధారణంగా ఉంది. ఇద్దరు ప్రత్యర్థులపైనా అతను రెండు మెరుపు అర్ధశతకాలు సాధించాడు. అతనితో పాటు కుశాల్‌ మెండిస్‌ గత మ్యాచ్‌లో కనబరిచిన జోరు..భారత అభిమానులని కలవర పెడుతోంది..అయితే ఈ మ్యాచ్ ఇరుజట్ల కి ఎంతో ముఖ్యమైన గెలుపు కాబట్టి ఒత్తిడిని జయించి ఆడేవారికి మాత్రం అవకాశాలు గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు..రాత్రి 7 గంటల నుంచీ డీ డీ స్పోర్ట్స్ లో ప్రారంభం కానుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: