ముక్కోణపు టీ -20 సీరీస్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో నువ్వా నేనా అనేట్టుగా తలపడ్డాయిశ్రీలంక,భారత జట్లు. ఈ మ్యాచ్ లో గెలుపు ఇరు జట్లకి తప్పని సరి అవ్వడంతో ఇరు జట్లు గెలుపుని  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..అయితే మొదటగా మ్యాచ్ ప్రారంభం లో శ్రీలంక బ్యాటింగ్ చేసి  153 పరుగుల లక్ష్యాన్నిభారత్‌ ముందు ఉంచింది..అయితే భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించింది.

..

ఇదిలాఉంటే భారత టీంలోమనీష్‌ పాండే‌(42)...దినేశ్‌ కార్తీక్‌‌(39) పరుగులు చేసి స్కోర్ వేగాన్ని పెంచారు, భారత విజయంలో కీలక పాత్ర పోషించారు..అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక ఆరంభ ఓవర్ లోనే దూకుడు ప్రదర్శించింది..ఆ తర్వాత ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కుదరుగా బౌలింగ్‌ చేసి తొమ్మిది పరుగుల ఇవ్వగా,  శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన మూడో ఓవర్‌లో గుణతిలకా(17) పెవిలియన్‌ చేరాడు.ఆపై స్వల్ప వ్యవధిలో కుశాల్‌ పెరీరా(3)ను వాషింగ్టన్‌ సుందర్‌ పెవిలియన్‌ పంపాడు. దాంతో లంక 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

Image result for dinesh karthik vs manish pandey

అయితే కుశాల్ మొండిస్ తో కలిసి 62 పరుగులు చేశాడు..ఆ తరువాత ఉప్పుల్ తరంగా పెవిలియన్ చేరాడు..తిషారా పెరీరా ,జీవన్ మొండిస్ లు అవుట్ అవ్వగానే కుశాల్‌ మెండిస్‌(55) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో శ్రీలంక స్కోరు బోర్డులో వేగం తగ్గింది.ఆతరువాత శ్రీలంక నిర్ణీత 19  ఓవర్స్ లో  152 పరుగులు చేసింది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: