తనకోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు..ఈ విషయం అనేక సందర్భాలలో రుజువయ్యింది కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ కూడా ఈ నిజాన్ని తెలుసుకున్నాడు..తన ప్రవర్తన కారణంగా భారీ జరిమానా విధించారు..ఇంతకీ ఏమి జరిగిందంటే..నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో పోరాడి విజయం సాధించింది...అయితే గెలుపు వల్ల వచ్చిన బలుపో ఏమో గానీ  విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వెంటనే విజిటర్స్ డ్రెస్సింగ్ రూము అద్దాలను బ్యాట్‌తో ధ్వంసం చేసి ఆనందం పంచుకున్నారు.

 

అయితే అసలు విషయం మాత్రం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వివాదమే ఇందుకు కారణమని చెబుతున్నారు. డ్రెస్సింగ్ రూములో ఉన్న వ్యక్తే అద్దాలను పగలగొట్టినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు...ఈ విషయంపై స్పందించిన  బంగ్లాదేశ్ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనష్టాన్ని భరిస్తామని చెప్పింది..అసలు అద్దాలు పగులకోట్టేలా ఏమి జరిగిందంటే..ఆఖరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 12 పరుగులు కావాల్సి ఉన్న దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తొలి బంతికి పరుగేమీ రాకపోగా రెండో బంతికి ముస్తాఫిజుర్‌ రనౌట్‌ అయ్యాడు. ఈ రెండు బంతులు నోబాల్స్ కోసం ఎదురుచూసింది. అంపైర్‌ నుంచి స్పందన లేకపోవడంతోపాటు..ముస్తాఫిజుర్‌ రనౌట్‌ కావడం వారిని అసహనానికి గురి చేసింది.

 Image result for id-not-called-batsman-back-says-bangladesh-captain-shakib-al-hasan

ఇదే టైం లో వచ్చిన సబ్‌స్టిట్యూట్‌ నూరుల్‌ హసన్‌.. థిసార పెరీరాతో గొడవకు దిగాడు. అటు బౌండరీ అవతల నుంచి షకీబ్‌ ఆగ్రహంతో ఊగిపోతూ తమ ఆటగాళ్లను బయటకి వచ్చేయమని  చెప్పడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే హెడ్‌ కోచ్‌ ఖాలెద్‌ మహమూద్‌, అంపైర్లు.. కెప్టెన్‌ను సముదాయించి ఆట సాగేలా చూశారు. ఒకవేళ ఆటగాళ్లు బయటకి వచ్చి ఉంటే బంగ్లాదేశ్ జట్టుపై అనర్హత వేటు పడి ఉండేది...అయితే ఈ గొడవ ప్రధాన కారణం అయిన షకీబ్‌కు ఆర్టికల్ 2.1.1 ప్రకారం క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని 2.1.2 ప్రకారం నురుల్‌కు మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: