నిదహాస్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది..శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ-20 సీరీస్ లో భాగంగా..జరిగిన ఉత్కంట పోరులో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది...సీరీస్ చివరి మ్యాచ్ లో బంగ్లా తో పోటీ పడిన టీమిండియా ఎట్టకేలకి విజయపతాకం ఎగుర వేసింది..సీనియర్స్ లేకుండా కేవలం  రోహిత్ శర్మ సారధ్యంలో సాగిన ఈ ట్రోఫీలో కొత్త ఆటగాళ్లకి చోటు కల్పించారు..దినేశ్‌ కార్తీక్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించాడు.

 Related image

దినేష్ కార్తీక్ కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో “29” పరుగులు సాధించి సీరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ చెలరేగి ఆడాడు...సీరీస్ పై ఆశలు వదులుకున్న సమయంలో చివరి నిమిషంలో దినేశ్‌ కార్తీక్‌ ఎప్పటికీ గుర్తిండిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత ప్రేక్షకులని అలరించాడు..

 Image result for india vs bangladesh dinesh karthik

టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది. 167 పరుగులు లక్ష్యానికి బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే  భారీ ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన మూడో ఓవర్ 4వ బంతికి ధవన్ భారీ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది...రోహిత్, రాహుల్‌లు రంగంలోకి దిగి మూడో వికెట్‌కి 50 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు...రాహుల్(24) భారీ షాట్‌‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు అయితే రోహిత్ మాత్రం నిలకడగా ఆడుతూ . టీ-20ల్లో 14వ హాఫ్ సెంచరీ చేశాడు.

 Image result for india vs bangladesh dinesh karthik

అంతకుముందు బంగ్లాదేశ్‌ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షబ్బీర్‌ రెహ్మాన్‌ దూకుడుగా ఆడటంతో జట్టుకు మంచి స్కోర్ సాధించాడు..ఒకవైపు వికెట్లు పడుతున్నా దాటిగా బ్యాటింగ్‌ చేసి బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు..ముందుగా బంగ్లాదేశ్‌ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది..లిటాన్‌ దాస్‌(11), తమీమ్‌ ఇక్బాల్‌(15), సౌమ్య సర్కార్‌(1)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అయితే షబ్బీర్‌ రెహ్మాన్‌ మాత్రం సమయోచితంగా చెలరేగి ఆడాడు. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే, చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు. మొహ్మదుల్లా(21)తో కలిసి 36 పరుగుల్ని జత చేసిన తర్వాత షబ్బీర్‌ చెలరేగి ఆడాడు... మెహిదీ హసన్‌ మరింత దూకుడు పెంచడంతో మొహరీన హసన్‌(19 నాటౌట్‌; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) లతో రెచ్చి పోవడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది...అయితే భారత బ్యాట్స్ మెన్స్  ఒక్కొక్కరుగా ఆడుతున్నా సరే మెరుపు వేగంతో ఆడిన  దినేశ్‌ కార్తీక్‌ భారత్ కి మంచి విజయాన్ని అందించి పెట్టాడు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: