ఐపీఎల్ పండుగ క్రికెట్ అభిమానులకోసం వస్తోంది..ఏప్రియల్ నెలలో జరుగబోతున్న ఐపీయల్ ప్రారంభ వేడుకలు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా జరుగనున్నాయని తెలుస్తోంది..ఎనిమిది జట్లు హోరాహోరీ పోరు నడుమ అభిమానులకి పండగే అని చెప్పవచ్చు..ఇప్పటికే సర్వం సిద్దం చేసిన ఐపీఎల్ నిర్వాహకులు టోర్నీలో కొన్ని కొత్త నిభందనలు కూడా చేస్తున్నారు.. అయితే ఈ ఐపీఎల్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే..

 Chennai Super Kings might line-up - Sakshi

ఇంతకూ ముందు జరిగిన ఐపీఎల్ పండుగ కంటే కూడా ఈ -2018 లో జరుగబోయే ఐపీఎల్ పండుగకి ఎంతో ప్రాధాన్యత ఉంది చెన్నై సూపర్ కింగ్స్ తన రెండేళ్ళ నిషేధాన్ని తొలగించుకుని ఇప్పుడు మళ్ళీ బరిలోకి దిగడానికి సిద్దంగా ఉంది..ఎంతో మంది చెన్నై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 Image result for chennai super kings

అయితే జట్టు తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ గురువారం జరిగింది. ఇందులో విదేశీ క్రికెటర్లు మినహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఏప్రిల్‌ 10న సొంతగడ్డపై చెన్నై తొలిమ్యాచ్‌ కోల్‌కతాతో ఆడుతుంది...చెన్నై సూపర్ కింగ్ గతంలో ఐపీఎల్ సీరీస్ లో సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే చాలా కాలం విరామం తరువాత మళ్ళీ జట్టులోకి అడుగుపెడుతున్న ఈ బ్యాచ్ ఈ సారి ఐపీఎల్ ని ఎలా అయినా సొంత చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు..చెన్నై వాసులు సైతం మా జట్టుకి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు..మరి ధోనీ ఈ సారి రికార్డు సృష్టిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: