క్రికెట్ క్రీడని ఈ మధ్యకాలంలో కుదిపేసిన విషయం బాల ట్యాంపరింగ్..ఈ విషయంలో మీడియా కోడై కూసిన విషయం అందరికీ తెలిసిందే ఈ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్‌ పరువుని మీడియా మరింతగా రోడ్డుకు ఈడ్చింది అనడంలో సందేహం లేదు..అయితే గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితులని గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీడియా మీద విసుగు పుట్టాక మానదు. అయితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ విషయంలో స్పందించాడు..మీడియా ని కడిగి పడేశాడు..వివరాలలోకి వెళ్తే.. 


బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్‌ల విషయంలో మీడియాల వ్యవహరిస్తున్న తీరుపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు...ట్విట్టర్ ని వేదికగా చేసుకుని సచిన్ ఆ ఇద్దరు ఆటగాళ్ళ పట్ల తన సానుభూతిని వ్యక్తపరిచారు...సచిన్ ఏమన్నారటంటే ‘‘వాళ్లు ఇప్పటికే చేసిన తప్పులకి తీవ్రంగా బాధపడుతున్నారు. వాళ్ల కుటుంబంతో ఉన్న సమయంలో కంటే కూడా వాళ్ళు ఇతర ఆటగాళ్ళతో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తు చేసుకుంటూ ఉంటారు.  అందుకే వాళ్ళని ప్రశాంతంగా వదిలేస్తే మంచిది వాళ్లని ఇక మీదట అలా వదిలేయండి..అంటూ సచిన్ ట్వీట్ చేశారు. కాగా సచిన్‌తో పాటు గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, కెవిన్ పీటర్‌సన్ తదితర క్రికెటర్లు కూడా స్మిత్, వార్నర్‌ల విషయం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధకరంగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: