మిథాలీ రాజ్ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు..కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ఆమెకి కూడా అభిమానులు ఎక్కువే.. 2001 – 3 సంవత్సర కాలంలో మిధాలీ ఇంగ్లాండ్ పై ఆడిన టెస్టు మ్యాచ్ లలో మహిళా క్రికెట్ జట్టులో 214 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది..అయితే..ఎన్నో రికార్డులని సొంతం చేసుకుని ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న మిథాలీ రాజ్ తాజగా మళ్ళీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది..అదేనంటే..

 Image result for mithali raj

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలు ఆడిన మొదటి  క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది..ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌ మిథాలీ రాజ్‌కు 192వ వన్డే. ఫలితంగా అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డును మిథాలీ సొంతం చేసుకుంది...ఈ విషయంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

 Image result for mithali raj

అయితే ఇదే సమయంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ 191 వన్డేల రికార్డును మిథాలీ సవరించింది. 1999 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిథాలీ.. ఆరువేల మైలురాయి అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా కూడా మిధాలి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే..తాజాగా ఈ రికార్డుతో తన రికార్డు పట్టికలో మరొక రికార్డు జత చేరింది..


మరింత సమాచారం తెలుసుకోండి: