క్రికెట్ ప్రేక్షకులకి ఇది ఒక రకంగా శుభవార్త మరొక రకంగా చెడు వార్తా ఎలా అంటే క్రికెట్ లోకి కొత్త రకం ఫార్మేట్ రాబోతోంది ఒక వేళ ఆ ఫార్మేట్ గనుకా సక్సెస్ అయితే మాత్రం ఇప్పుడు యావత్ క్రికెట్ అభిమానులని ఉర్రూతలూగించిన ఐపీఎల్ ఘోరంగా దెబ్బతింటుంది..ఇప్పుడు ఇదే ఆందోళన ఐపీఎల్ నిర్వహసున్న వారికి కలుగుతోంది..అసలు క్రికెట్ ప్రపంచంలో ఇన్ని కొత్త పుంతలు తొక్కడం నిజంగా ఆశ్చర్యాని కలిగిస్తుంది ఎందుకంటే

 Image result for 100 bowles new format ecb

క్రికెట్ లో ఎప్పుడైతే వన్డేలు ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచీ క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతూ వెళ్ళింది.. ముందుగా టీ20ల రాకతో దాని స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో సంచలనం దిశగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దూసుకెళ్తోంది. 2020లో నిర్వహించ తలపెట్టిన 8 జట్ల దేశవాళీ టోర్నీలో వంద బంతుల టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారమే ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది..

 Image result for 100 bowles new format ecb

వంద బంతుల ఫార్మాట్‌లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక్క ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయని ఇంగ్లండ్ బోర్డు పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ స్పందిస్తూ.. వంద బంతుల క్రికెట్‌కు గుడ్‌లక్ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు...అయితే ఈ ఫార్మెట్ వలన ఐపీఎల్‌ పూర్తిగా నాశనం చేస్తుందని గార్డియన్ రైటర్ బెర్నే పేర్కొన్నారు. అయితే ఇప్పటికే క్రికెట్ లో  మూడు ఫార్మాట్‌లు ఉన్నాయని, ఇంకోటి అవసరం ఉందని అనుకోవడం లేదని  పలువురు నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు..అయితే ఈ కొత్త ఫార్మేట్ రూపకల్పన జరుగుతోందని త్వరలోనే ఈ విషయాలు వెల్లడి అవుతాయన....ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టామ్ హారిసన్  అన్నారు

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: