ప్రతిభకి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది అటుఇటుగా తప్పకుండా ప్రతిభకి పట్టం కడుతుంది భారత ప్రభుత్వం అయితే..తాజాగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణ పతకాలు గెలిచినా వారిలో కొంత మందికి భారత ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది...అందులో భాగంగానే కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పేరును అత్యున్నత క్రీడాపురస్కారం ఖేల్‌రత్నకు భారత అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిపాదించింది.

 Image result for neeraj chopra

అయితే రెండేళ్ల క్రితం జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన 20 ఏళ్ల నీరజ్‌...ఇటీవల జరిగిన  కామన్వెల్త్‌ క్రీడల్లో భారత సత్తా చాటి చూపాడు..విజేతగా నిలిచాడు...అదేవిధంగా మహిళా జావెలిన్‌ త్రోయర్‌ అనూ రాణి..డిస్కస్‌ త్రోయర్‌ సీమా పూనియాలను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసినట్టు ఏఎఫ్ఐ తెలిపింది.

 Image result for neeraj chopra

ఇదిలాఉంటే ఇక లెజెండరీ అథ్లెట్‌, భారత యూత్‌ జట్టు కోచ్‌ పీటీ ఉష..సంజయ్‌ గార్నిక్‌..బాబీ అలోసిస్‌..కుల్దీప్‌ సింగ్‌..జటా శంకర్‌ల పేర్లను ద్రోణాచార్య పురస్కారానికి, టీపీ ఊసె్‌ఫను లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఏఎఫ్‌ఐ ప్రతిపాదించింది. ఇక కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన తెలుగు షట్లర్‌ సిక్కి రెడ్డి పేరును అర్జున అవార్డుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం నామినేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: