కోహ్లీ పై ఇంటా బయటా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి..అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉండకుండా ఇంగ్లండ్‌ కౌంటీలకు వెళ్ళడంతో అభిమానులు తీవ్రస్థాయిలో మంది పడుతున్నారు..చారిత్రాత్మకమైన అఫ్గాన్‌ టెస్టుకు కోహ్లి దూరం కావడం నిజంగా చాలా అనాలోచిత నిర్ణయమని తిట్టిపోస్తున్నారు..ఈ నేపథ్యంలో అమితాబ్‌ చౌదరి కోహ్లిని తిట్టవద్దని కోరారు. అఫ్గాన్‌ టెస్టుకు దూరం కావడంలో కోహ్లికి వేరే ఉద్దేశం లేదని, ఇంగ్లండ్‌ పరిస్థితులను తెలుసుకోవడం కోసమే అతను అక్కడికి వెళ్తున్నాడని తెలిపారు.

 Image result for fans fire on kohli

అఫ్గానిస్తాన్‌లో ఆడకూడదు అనే ఉద్దేశ్యం కోహ్లీకి లేదని ఇంగ్లండ్‌ గడ్డపై రాణించి అభిమానులను సంతృప్తిపరచాలనే ఉద్దేశ్యంతోనే అతను కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు మొగ్గు చూపాడుని ఈ నిర్ణయంలో ఎలాంటి మరే కారణాలు లేవని అభిమానులు కోహ్లీ ని అర్థం చేసుకోవాలని తెలిపాడు అంతేకాదు ఇందులో కొంత మంది ఆటగాళ్ళని ముందుగానే పంపామని స్పష్టం చేశాడు అమితాబ్‌ చౌదరి

 

అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు ఆఫ్ఘానిస్థాన్‌తో టెస్టుకు దూరంగా ఉండాలని విరాట్‌ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై క్లార్క్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బెంగళూరులో జరిగే ఆ చారిత్రక టెస్టులో విరాట్‌ ఆడితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు...కోహ్లీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులనే గాక సీనియర్ క్రికెటర్స్ ని ఆశ్చర్య పరుస్తోంది..ఏది ఏమైనా సరే కోహ్లీ అఫ్గానిస్తాన్‌ తో మ్యాచ్ ఆడి ఉండాల్సిందని సోషల్ మీడియాలో అభిమానులు తమ భాదని వ్యక్తం చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: