టీం ఇండియా మాజీ కెప్టెన్..సౌరవ్ గంగూలి నిన్న ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు..టీం ఇండియా అద్భుతమైన ఆటతీరు ని ప్రదర్శిస్తుంది  అని పొగడ్తల్లో ముంచెత్తాడు..అయితే డే అండ్ నైట్ మ్యాచ్ ల గురించి ప్రస్తావించిన గంగూలి వాటిపై కూడా ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు..టీం ఇండియా క్రికెటర్స్ ఎలాంటి పరిస్థితిలో అయినా సరే గెలుపు సాధించగలరని అన్నాడు. అంతేకాదు

 Image result for ganguly

భవిష్యత్‌ అంతా పింక్‌ బాల్‌ టెస్టుదేనని...ఏదో ఒకరోజు డే/నైట్‌ టెస్టు ఫార్మాట్‌కు అన్ని దేశాలూ ఓకే చెప్పాల్సిందేనని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు...టెస్టు హోదా కలిగిన దేశాల్లో భారత్‌, బంగ్లాదేశ్‌లో పింక్‌ బాల్‌ మ్యాచ్‌లకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు..అయితే భారత్ కి ఎంతో మంచి ప్లేయర్స్ ఉన్నారని వారి  ఈ ఫార్మేట్ లో సక్సెస్ అవుతారని అన్నారు.

 Image result for ganguly

అయితే డే/నైట్‌ టెస్టు నెగ్గే సత్తా టీమిండియాకు ఉందని...ఆఫ్ఘానిస్థాన్‌తో టెస్టుకు దూరంగా ఉండాలన్న కోహ్లీ నిర్ణయాన్ని కూడా సౌరవ్‌ సమర్థించాడు. కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి కోహ్లీకి ఇంగ్లండ్‌ టూర్‌ ఎంతో ముఖ్యమన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు రహానెను జట్టు నుంచి పక్కకి తప్పించడం పై ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: