Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Aug 16, 2018 | Last Updated 11:07 am IST

Menu &Sections

Search

“సచిన్” చేసిన సాయం..భారత్ కి “విజయం” అందించింది

“సచిన్” చేసిన సాయం..భారత్ కి “విజయం” అందించింది
“సచిన్” చేసిన సాయం..భారత్ కి “విజయం” అందించింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డబ్బు ఉంటే గొప్పవాళ్ళు అయిపోరు దాన్ని నలుగురికి అవసరానికి సాయం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు గొప్పగా కీర్తించబడుతారు ఇది నీతి అయితే ఇందుకు చక్కటి ఉదాహరణ మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిగా సచిన్ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూనే ఉంటాడు అయితే తాజాగా చేసిన సాయంతో తన వ్యక్తిత్వాన్ని మరో మారు అందరికీ చాటి చెప్పి ఆదర్సవంతుడయ్యాడు.

 indian-cricketer-sachin-tendulkar-help-indian-whee

క్రికెట్ లో అంధుల క్రికెట్ జట్టు కూడా బాగా ప్రాచుర్యం పొందింది...ఈ కోవలోకి వీల్‌చైర్ క్రికెట్ కూడా వచ్చి చేరుతున్నది. తాజాగా వీల్ చైర్ క్రికెట్ జట్టు తమ తొలి విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెల్చి సీరీస్ సొంతం చేసుకుంది.. అయితే ఈ పర్యటనకు వెళ్లడం కోసం వీల్‌చైర్ క్రికెటర్లు ప్రయాణ ఖర్చుల కోసం ఎదురుచూసిన సమయంలో భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ రూ.4.50లక్షలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.

 indian-cricketer-sachin-tendulkar-help-indian-whee


ఈ విషయాన్ని వీల్‌చైర్ క్రికెట్ ఇండియా(డబ్ల్యూసీఐ) కార్యదర్శి ప్రదీప్ రాజ్ తెలిపాడు...ఈ పర్యటనకి వెళ్ళడానికి మొత్తం రూ.6.50లక్షలు అవసరం...అందుకోసం నిధుల సేకరణ చేసాం ఒక దాత ముందుకు వచ్చి రూ.2లక్షలు సాయం చేశాడు...మిగిలిన సొమ్ము కోసం సాయం కోరుతూ సచిన్ కి మెయిల్ చేశా. మూడు రోజుల్లోనే సచిన్ ఆఫీస్ నుంచి మాకు సందేశం రావడం నమ్మలేకపోయాను. సచిన్ నుంచి మాకు రూ.4.5లక్షల సాయం అందింది. ఆ సాయం గనుక అందిఉండకపోతే పర్యటనను రద్దు చేసుకునే వాళ్ళమని తెలిపారు..

 indian-cricketer-sachin-tendulkar-help-indian-whee

ఈ డబ్బుతో మొత్తం 19 మంది జట్టు సభ్యులకు విమాన టికెట్లు బుక్ చేశాం. మిగిలిన డబ్బుతో ప్రతీ క్రికెటర్‌కు రూ.10వేలను సిరీస్ ఫీజుగా చెల్లించాను. సచిన్ సాయం వెలకట్టలేనిది అంటూ ప్రదీప్ రాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. సచిన్ తమకు ఆర్థిక సాయం మాత్రమే చేయలేదని, దేశానికి ఆడే అద్భుత అవకాశం కల్పించారని వీల్ చైర్ క్రికెటర్లు మాస్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు

 

 


indian-cricketer-sachin-tendulkar-help-indian-whee
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author