ఐసీసీ తన ఉనికిని కోల్పోనుందా దానికి ప్రత్యామ్నాయంగా వేరే కొత్త శక్తులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు ఐసీసీ వ్యూహాత్మక వర్కింగ్ కమిటీ..గురువారం జరగనున్న సమావేశంలో ఇదే అంశంపై బీసీసీఐతో “ఎస్‌డబ్ల్యూజీ” చర్చించనుంది. భేటీలో బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌధురి, కోశాధికారి అనిరుద్‌ చౌధురి పాల్గొననున్నారు...అయితే ఐసీసీ కి పొగబెడుతున్న వారిలో ఓ ప్రముఖ క్రికెట్‌ మాజీ పరిపాలకుడు మరియు  ఓ భారత టీవీ చానెల్‌, మరో ఆస్ర్టేలియా లాయర్‌..ఐసీసీకి పోటీ సంస్థను ఏర్పాటు చేసేందుకు పలువురు ఆటగాళ్లు, అధికారులను సంప్రదించారు.

 Image result for icc

అయితే ఈ ఆపరేషన్ కి వారు పెట్టిన పేరుని “ఆపరేషన్‌ వాటర్‌షెడ్‌” అయితే ఈ విషయంపై స్పందించిన ఒక అధికారి “ప్రతి దేశంలోనూ పోటీ క్రికెట్‌ సంఘాలను ఏర్పాటు చేయాలన్నది వారి లక్ష్యం. క్రికెటర్లకు భారీగా డబ్బు ఆశ చూపుతున్నారు అయితే వారు సత్ఫలితాలు పొందలేక పోయారు అయితే మళ్ళీ వారు ఆటగాళ్ళని భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంటుంది అయితే ఆటగాళ్ళు మళ్ళీ వారి వద్దకు వెళ్ళకుండా ఉండరు అని చెప్పలేము అని అన్నారు.

 Image result for icc

 ఇదిలాఉంటే ఐసీసీ  మనుగడకి సవాళ్లు విసురుతున్న మరొక అంశం టీ- 10 ఫార్మేట్..రాబోయే రోజుల్లో టెస్ట్‌ క్రికెట్‌కు మనుగడ ఉండదని బ్రెండన్‌ మెకల్లమ్‌ కొద్దికాలం కిందట వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ టీ10 ఆలోచన రావడం ఐసీసీ మనుగడకి మరింతగా ముప్పు తీసుకురానుంది అంటున్నారు..ప్రసార హక్కుల మార్కెట్లో పోటీ వాతావరణం లేకపోవడం కూడా మరో ఆందోళనకర పరిణామంగా అంచనా వేసింది. ‘స్టార్‌, సోనీ మినహా మరే సంస్థలు క్రికెట్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు  రావడంలేద’ని ఆ అధికారి వివరించారు...ఏది ఏమైనా సరే భవిష్యత్తులో ఐసీసీ కి పోటీగా మరొక ప్రత్యామ్నాయం రావడం ఖాయం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: